ఆ కారణలతో అశోక్ గల్లా రెండవ సినిమాపై పెరిగిన అంచనాలు..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన మొదటి మూవీ తో మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో అశోక్ గల్లా ఒకరు. ఈ యువ హీరో పోయిన సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన హీరో మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

అలా హీరో మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయం సొంతం చేసుకోవడంతో ఈ హీరో కు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. హీరో మూవీ తర్వాత వెంటనే మూవీ స్టార్ట్ చేయకుండా కాస్త సమయం తీసుకున్న ఈ యువ హీరో తాజాగా తన రెండవ మూవీ ని ప్రారంభించాడు. అశోక్ హీరోగా రూపొందబోయే రెండవ మూవీ నిన్న అధికారికంగా ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రారంభం కావడంతోనే ఈ మూవీ పై అంచనాలు కూడా తారా స్థాయిలో పెరిగిపోయాయి.

దానికి ప్రధాన కారణం ఈ హీరో నటిస్తున్న రెండవ మూవీ కి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అత్యంత టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రశాంత్ వర్మ కథను అందించడం. అలాగే తాజాగా ధమాకా మూవీ కి బ్లాక్ బాస్టర్ సంగీతాన్ని అందించిన బీమ్స్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించడం. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ డైలాగ్ రైటర్ గా ఉన్న సాయి మాధవ్ బుర్ర ఈ మూవీ కి డైలాగ్స్ రాస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ కి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: