లవ్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్..!!

Divya
యంగ్ హీరో సందీప్ కిషన్ , హీరోయిన్ గా రెజీనా లవ్ లో ఉన్నారంటు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సందీప్ కిషన్ హ్యాపీ బర్తడే పాప ఐ లవ్ యు. ఎప్పుడు నీకు మంచే జరగాలి అంటూ ఒక క్యాప్షన్ ని క్లిక్ చేయడం జరిగింది దీనికి రెజీనాతో క్లోజ్ గా ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. ఇది చూసిన కొంతమంది నెట్టిజెన్స్ వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేయడం జరిగింది. తాజాగా దీనిపై సందీప్ కిషన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.
మైఖేల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. రెజీనా నేను కలిసి నాలుగు సినిమాలు చేశాము దీంతో తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యిందని ఫ్యామిలీ మెంబర్గా కూడా .. తను మా కుటుంబానికి బాగా తెలుసు తను ఏదైనా పనిమీద బొంబాయికి వెళ్ళినప్పుడు తన సోదరీ ఇంట్లోనే ఉంటుందని తెలిపారు.12 సంవత్సరాలుగా మేము ఒకరికి ఒకరం తెలుసు మేమిద్దరం మంచి స్నేహితులమే అంటూ సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇక మీడియా కూడా తమ గురించి తెలియక ఏవేవో రాసిస్తూ ఉంటారు అందుకే క్లారిటీ ఇచ్చాను తెలిపారు సందీప్ కిషన్.

ఇక సందీప్ కిషన్, రెజీనా కలిసి 4 సినిమాలలో నటించారు.దాదాపుగా కెరియర్ ఇద్దరూ కూడా ఒకేసారి ప్రారంభించారు. అలా కెరియర్ ప్రారంభించి నాలుగు సినిమాలు చేసేసరికి ఏర్పడడంతో పలు రూమర్స్ పుట్టుకొచ్చాయని తెలిపారు సందీప్ కిషన్. ఇక మైఖే ల్ సినిమా పాత్ర కోసం సందీప్ కిషన్ తన లుక్ ను కూడా మార్చుకున్న తీరును చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు ఈ పాత్రలో దీనమైన నటించారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి యాక్షన్ సినిమాలలో అదరగొట్టేసారని కూడా తెలుస్తోంది అయితే డైరెక్టర్ రంజిత్ తీర్చిదిద్దిన ఈ కథలో కొత్తదనం లేకపోవడంతో పర్వాలేదు అనిపించుకుంటోంది ఈ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: