24 గంటల్లో "దసరా" టీజర్ కు మామూలు రెస్పాన్స్ రాలేదుగా..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అదిరిపోయే క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం నాని "అంటే సుందరానికి" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకోగా , అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్ లో ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు కలెక్షన్ లను వసూలు చేసి యావరేజ్ మూవీ గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఈ సినిమాకు వివేక్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ టీజర్ ఆధ్యాంతం  ప్రేక్షకులను ఆకట్టుకున్న విధంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ విడుదల అయిన 24 గంటల్లో 6.97 మిలియన్ వ్యూస్ ను ... 225.1 కే లైక్ లను సాధించి ఓవరాల్ గా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: