హాస్పిటల్ లో చేరిన ఇలియానా ఏమైందో తెలుసా...?

murali krishna
ఇలియానా  అనారోగ్యంతో బాధపడుతూ  ఇటీవలే ముంబైలోని ఆస్పత్రిలో చేరింది.ఇలియానా తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అభిమానులతో షేర్ చేసుకుంది.
రోజుకు మూడు ఐవి ఫ్లూయిడ్స్ ను ఎక్కిస్తున్నారని.. మంచి వైద్యులు అందిస్తున్న చికిత్స కారణంగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని ఇలియానా తన సోషల్ మీడియా పోస్టు లో చెప్పుకొచ్చింది.

ఇలియానా తన సోషల్ మీడియా పోస్టు లో మూడు ఫోటోలు పోస్ట్ చేసింది.తనకు ఆరోగ్యం గురించి బాధ పడ్డ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది ఇలియానా.. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యం గా ఉన్నానని చెప్పుకొచ్చింది. సరైన చికిత్స తీసుకోమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక తన ఆరోగ్యం గురించి ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.. దాదాపు సూసైడ్ చేసుకోవాలన్నంత ఆలోచనల వరకు వెళ్లి వచ్చాను అని చెప్పుకుని ఆందోళన వ్యక్తంచేసింది. జీవితం లో ఒడిదుడుకులు వస్తాయి వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగిపోవాలి కానీ అధైర్యపడకూదంటూ అప్పట్లోనే అభిమానులకు తాను ఎదుర్కొంటున్న కష్ట దశ ను చెప్పుకొచ్చింది.

ఇలియానా తన సినిమా కెరీర్ పరంగా దక్షిణాది న తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు బాగా బిజీ హీరోయిన్‌ గా ఏలిన ఆ తరువాత దక్షిణాదిన అవకాశాలు తగ్గడంతో హిందీలో అవకాశాలు వెతుక్కుంటూ ముంబై కి వెళ్ళిపోయింది.అక్కడ కూడా తనకి సరైన అవకాశాలు రావట్లేదు. ముంబై కి వెళ్లిన అక్కడ రణబీర్ కపూర్ తో బర్ఫీ సినిమా మంచి విజయం సాధించిన ఆ సినిమా తనకు మంచి అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేకపోయాయని చెప్పవచ్చు. ఆ తరువాత తెలుగులో రవితేజ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన కానీ లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇలియానా ను అందరూ మర్చిపోయారు. ఆమె బరువు పెరగడం కూడా ఆమె కెరీర్ కు నష్టం తెచ్చింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: