నాని ఊర మాస్ మూవీ విడుదల ఎప్పుడో తెలుసా...?

murali krishna
నాచురల్ స్టార్ నాని సినిమాలు  కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా ఉంటాయి.
నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఆ వెంటనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిన కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అంతగా మెప్పించలేక పోయింది అనే చెప్పవచ్చు..

ఇక ఈ సినిమా తర్వాత ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ''దసరా'' సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది.. ఈ సినిమా మంచి విలేజ్ డ్రామాగా తెరకెక్కుతుంది.. నాని ఎప్పుడు లేని విధంగా పిచ్చ మాస్ సినిమాతో రానున్నాడు.నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారట..ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి మరింత హైప్ పెంచడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే దసరా టీజర్ విడుదల చేయనున్నారు. మరి ఈ టీజర్ ను ఒక్కో భాషలో ఒక్కో సెలబ్రిటీ విడుదల చేయబోతున్నారు అని మేకర్స్ తాజాగా అప్డేట్ ఇచ్చారు.. తెలుగులో గ్రాండ్ ఈవెంట్ తో విడుదల చేయనుండగా.. హిందీలో ఈ టీజర్ ను షాహిద్ కపూర్ మరియు తమిళ్ లో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు.07:32 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: