శ్రీనివాసమూర్తి మరణం ఘోరం.. బాధలో హృతిక్, సూర్య?

Purushottham Vinay
సింహం లాంటి గంభీరమైన వాయిస్ తో స్టార్‌ హీరోలకు ప్రాణం పోసిన ఫేమస్ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాసమూర్తి హఠాన్మరణం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో షాక్‌కు గురి చేసింది.చెన్నైలోని తన సృగృహంలో ఆయన తన తుది శ్వాస విడిచారు.ఇక ఆయన గుండెపోటుతో కన్నుమూశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడీ విషయంలో షాకింగ్‌ ట్విస్ట్‌ జరిగింది. చనిపోక ముందు శ్రీనివాసమూర్తి తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి ప్రమాదవశాత్తూ కిందపడినట్లు సమాచారం తెలిసింది.ఇక ఆయన కిందపడిన వెంటనే  హార్ట్‌ ఎటాక్‌కు గురయ్యారట. ఇది గుర్తించిన ఆయన కుటుంబసభ్యులు ఆయనును వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మూర్తి గారి ఆరోగ్యం బాగా విషమించిందట. దీంతో వైద్యులు  ఆయనకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్సని అందించారు.అయినా కానీ దురదృష్టవశాత్తూ వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. చికిత్స పొందుతూనే మూర్తి గారు తుదిశ్వాస విడిచారు. దాదాపు 2వేలకు పైగా సినిమాలకు శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ముఖ్యంగా హాలీవుడ్, బాలీవుడ్ల సినిమాలని దక్షిణాది ప్రాంతీయ భాషల్లోకి తమిళ, మలయాల, కన్నడ సినిమాలని తెలుగులోకి అనువదించడంలో ఆయన పాత్ర చాలానే ఉంది.


 హృతిక్‌ రోషన్‌, సూర్య, మోహన్ లాల్ ఇంకా ఎందరో హాలీవుడ్ స్టార్‌ హీరోలకు తన గొంతును అరువిచ్చారాయన.ఇక శ్రీనివాస మూర్తిపై పలువురు స్టార్స్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతో నష్టాన్ని, బాధను కలిగిస్తుంది.. తెలుగులో నాకు ఇంత గొప్ప ప్రేమ దక్కడానికి కారణం ఆయనే. ఆయన గొంతు ఇంకా ఎమోషన్స్‌ నా పాత్రలకు ప్రాణం పోశాయి. మిమ్మల్ని ఎప్పటికీ కూడా నేను మిస్ అవుతూనే ఉంటాను సర్.. మీరు చాలా త్వరగా వెళ్లిపోయారు అంటూ బాగా ఎమోషనల్ అయ్యాడు సూర్య. ఆయన నటించిన సింగం, సింగమ్‌ 2, సింగం 3, రాక్షసుడు, 24, వీడొక్కడే, ఆరు ఇంకా నువ్వు నేను ప్రేమ వంటి సూపర్ హిట్ సినిమాలకు మూర్తి గారు డబ్బింగ్‌ చెప్పారు. ఇక హృతిక్‌ రోషన్ క్రిష్‌, క్రిష్‌ 3, కాబిల్‌, బ్యాంగ్‌బ్యాంగ్‌ ఇంకా ధూమ్‌ 2 సినిమాలకు కూడా ఆయనే డబ్బింగ్‌ చెప్పారు. ఈ క్రమంలో మూర్తి గారి మరణంపై ఈ విధంగా స్పందించాడు హృతిక్.. 'మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. మీ గొంతు నన్ను తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యేలా చేసింది. ఆ విషయంలో నేను మిమ్మల్ని చాలా మిస్సవుతాను' అని సంతాపం తెలిపారు హృతిక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: