లెట్స్ గెట్ మ్యారీడ్ అంటున్న ధోని.!

Divya
ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఇతర రంగాలలో పెట్టుబడిగా పెట్టి ఆస్తులు కూడపెట్టుకుంటుంటే మరి కొంత మంది మాత్రం ఇతర రంగాలలో సంపాదించిన డబ్బులను సినిమా రంగంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. అలాంటి వారిలో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని.. తాజాగా ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ప్రపంచ క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్ గా ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ తో పాటు కోట్లాదిమంది అభిమానులను తన వశం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెప్పినప్పటికీ కూడా ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సక్సెస్ఫుల్గా నడిపిస్తూ దూసుకుపోతున్నారు.
మరొకవైపు క్రికెట్ ద్వారా సంపాదించిన డబ్బుతో పలు వ్యాపారాలు చేస్తున్న ఈయన పలు యాడ్స్ లో కూడా చేస్తున్నారు . ఈ క్రమంలోనే తాజాగా "ధోని ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ " అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్థాపించి ఒక తమిళ సినిమాను తమ బ్యానర్ పై తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. "లెట్స్ గెట్ మ్యారీడ్" అనే తమిళ సినిమా ద్వారా తన ప్రొడక్షన్ కంపెనీని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు ధోని. హరీష్ కళ్యాణ్ , లవ్ టుడే హీరోయిన్ ఇవాళ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి నదియా ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక గ్లింపు ని రిలీజ్ చేస్తూ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాము అంటూ కూడా తెలిపారు ధోని. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను రమేష్ తమిళమని తెరకెక్కిస్తున్నారు అంతేకాదు ఈ సినిమా కథ లో ధోని భార్య సాక్షి సింగ్ హస్తం కూడా ఉందని తెలుస్తోంది..  ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ కి ఆయన భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా మంచి ఫ్యామిలీ  ఎంటర్టైన్మెంట్ మూవీగా రాబోతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: