బుట్ట బొమ్మ ట్రైలర్ లాంచ్ చేయనున్న టాలెంటెడ్ యంగ్ హీరో..!

Divya
తాజాగా సూర్య వశిష్ట , అనికా సురేంద్రన్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ చిత్రం బుట్ట బొమ్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై పూర్తిస్థాయిలో అభిమానులలో అంచనాలు పెరుగుతున్నాయి. శౌరి చంద్రశేఖర రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది. మలయాళంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న కప్పెల మూవీకి అఫీషియల్ రీమేక్ గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులు సినిమాపై మరింత హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుట్ట బొమ్మ థియేటర్ ట్రైలర్ జనవరి 28వ తేదీన యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేయిస్తున్నట్లు సమాచారం. వంశీ పచ్చి పులుసు కెమెరామెన్ గా ఈ సినిమాకు పని చేస్తుండగా.. ఈ సినిమాకు గోపీచంద్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే విశ్వాసం వంటి సినిమాల ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనను ప్రూవ్ చేసుకున్న అనిత సురేంద్రన్.. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీ ప్రవేశం చేయబోతోంది. హీరోయిన్గా మొదటి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది . మరి ఈ సినిమా అనికా సురేంద్రన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.  మరొకవైపు మాస్టర్ వంటి  సినిమాలలో విలన్ గా నటించిన అర్జున్ దాస్ కూడా ఈ సినిమా ద్వారా హీరోగా మారుతున్నాడు. మరి వీరిద్దరికీ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది ఇప్పుడు అభిమానులలో ఉత్కంఠకు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: