బాలకృష్ణ... అనిల్ రావిపూడి మూవీకి సంబంధించిన ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా , మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో హనీ రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , వరలక్ష్మీ శరత్ ... కుమార్ దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించారు.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. జనవరి 12 వ తేదీన ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే  ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుండడంతో ఈ మూవీ షూటింగ్ ను ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృందం నిర్వహిస్తుంది.

ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ  కాజల్ అగర్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోడ్ లో కనిపించడం లేదు అని సింగిల్ రోల్ లోనే కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: