రష్మిక టాటూ వెనుక ఆంతర్యం !

Seetha Sailaja
‘పుష్ప’ మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక బాలీవుడ్ లో కూడ తన సత్తాని చాటాలని చాల గట్టిప్రయత్నాలు చేస్తోంది. బాలీవుడ్ టాప్ హీరో అమితాబచన్ తో కలిసి నటించిన ఎమోషనల్ డ్రామా మూవీ ‘గుడ్ బై’ పరాజయం చెందడంతో ఆమె ఆశలు నిరాశ అయ్యాయి. దీనితో ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసి నటించిన ‘మిషన్ మజ్ను’ ఆమెకు మంచి పేరు తెచ్చి పెడుతుందని రష్మిక ఆశ పడినప్పటికీ ఆమూవీ ధియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతూ ఉండటంతో ఆమె షాక్ కు గురైంది.

ఈమూవీలో రష్మిక అంధురాలుగా నటిస్తోంది. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుడి చేతి మణికట్టు పై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ టాటు వెనుక ఉన్న అర్థాన్ని వివరించింది. రష్మిక చదువుకునే రోజులలో టాటు వేయించుకోవాలనే కోరిక ఆమెకు ఉండేదట. అయితే ఆమె క్లాస్ మేట్ ఒక అబ్బాయి రష్మికను ఆట పట్టిస్తూ అమ్మాయిలు కూడ టాటు ను వేయించుకోగలరా అని ప్రశ్నించాడట.

ఎందుకంటే అమ్మాయిలు సూదులు అంటే చాలా భయపడతారు కదా అంటూ జోక్ చేసాడట. ఆప్పట నుండి రష్మిక కు టాటు వేయించుకోవాలనే బలమైన కోరిక ఉండటంతో ఎట్టకేలకు రష్మిక తాను టాటు వేయించుకున్నానని చెపుతూ ఆ టాటు వెనుక అర్థాన్ని వివరించింది. ‘మీ శక్తిని వేరొకరి శక్తితో భర్తీ చేయలేరు. మరెవరూ మీరు కాలేరు. మీరు ఇతరులను భర్తీ చేయలేరు. మనమందరం మన సొంత మార్గాలలో వెళ్లాలి’ అన్న అర్థంతో తాను ఇర్రీప్లేసబుల్ అన్న పదాలతో టాటు వేయించుకున్నాను అని అంటోంది.

లేటెస్ట్ గా తమిళ టాప్ హీరో విజయ్ తో ఆమె కలిసి నటించిన ‘వారసుడు’ మూవీ ఊహించిన స్థాయిలో బ్లాక్ బష్టర్ హిట్ కాకపోవడంతో ఇప్పుడు రష్మిక ఆశలు అన్నీ ‘పుష్ప 2’ పైనే ఉంటూ తన నేషనల్ క్రష్ స్థానాన్ని ‘పుష్ప 2’ మరింత పెంచుతుందని ఆమె ఆశిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: