ఎన్టీఆర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన రాజీవ్ కనకాల...!!

murali krishna
రాజమౌళి దర్శకుడు కాక ముందు తన సినీ కెరియర్ తొలి నాళ్లలో తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా కొన్ని సినిమాలకి పని చేసాడు అలాగే దాని తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు.అయితే రాఘవేంద్ర రావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో డైరెక్టర్ గా రాజమౌళి కి స్టూడెంట్ నెంబర్1 సినిమా తెరకెక్కించే ఛాన్స్ కూడా వచ్చింది...ఈ సినిమా లో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు.అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర లో నటుడు రాజీవ్ కనకాల కూడా నటించాడు. ఈ సినిమా సమయంలో లో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాలని చాలా ఆటపట్టించే వాడట.
 ఈ విషయాన్నీ రాజీవ్ కనకాల ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు...షూటింగ్ సమయంలో  వీళ్ళిద్దరూ పెట్టుకునే చిన్నపాటి అల్లర్లను ఆపడానికి రాజమౌళి కి రాజమౌళి కి విసుగు వచ్చేదట చాలా సార్లు ఎన్టీఆర్ చేసే టీజింగ్ కి రాజీవ్ కి షూటింగ్ నుంచి వెళ్లిపోవాలి అనిపించేదని కానీ మళ్ళీ అన్ని వదిలేసి షూటింగ్ చేసేవాడని సమాచారం.
ఒక రోజు అయితే ఒరేయ్ రాజీవ్ ఇలా రారా అని పిలిచి  చాలా అటపట్టించాడట ఎన్టీఆర్. కానీ ఎన్టీఆర్ చివరికి ఇదంతా ఊరికే జోక్ గా అంటున్న ఇవేమీ అస్సలు మనసులో పెట్టుకోకు అని చెప్పడం తో ఇక అప్పటి నుండి వారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారని సమాచారం..అప్పుడు జరిగిన చిన్న చిన్న గొడవల వల్లే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి స్నేహితులుగా కొనసాగుతూనే ఉన్నాం అని చెప్తూ ఎన్టీఆర్ ఇప్పటికీ కూడా స్నేహాని కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అందుకే నాకు తారక్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పాడు... అలాగే ఎన్టీఆర్ కి కూడా రాజీవ్ అంటే కూడా ఎంతో ఇష్టం అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన చాలా సినిమాల్లో కూడా రాజీవ్ కనకాల కూడా ఉండే విధంగా చూసుకుంటూ వచ్చాడని తెలుస్తుంది. మొదట్లో తన చిలిపి చేష్టలతో రాజీవ్ కి కోపం తెప్పించిన కానీ ఎన్టీఆర్ రాజీవ్ కి మంచి స్నేహితుడిగా వున్నాడు …

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: