పఠాన్ ని ఆకాశానికి ఎత్తేసిన వివాదాల దర్శకనిర్మాత?

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పఠాన్ సినిమాకి డే 1 నుంచే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో షారుఖ్ బ్లాక్ బిగ్గెస్ట్ బస్టర్ హిట్ అందుకున్నారు.జనవరి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీతో దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తరువాత వచ్చి 10 సంవత్సరాల తరువాత తన రేంజ్ కి తగ్గ హిట్ ని అందుకున్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఉబ్బి తబ్బిబ్బయ్యి  ప్రశంసలు కురిపించారు. ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కితాబిచ్చారు. మూవీ టీం పనితీరును ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా సల్మాన్.. షారుఖ్ సన్నివేసాలు వచ్చినప్పుడు తాను నిల్చొని చప్పట్లు కొట్టినట్లు కరణ్ తెలిపారు. ఈ మూవీ మొత్తానికి కూడా ఆ సీన్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్నట్లు తెలిపారు.'చివరిసారిగా మూవీల్లో నేను ఇంత సరదాగా గడిపిన సందర్భాలు నాకు గుర్తులేవు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మాత్రమే.


 ఇక మెగా అనే పదం దీనికి సరిగ్గా సరిపోతుంది. షారుఖ్ లుక్స్, తేజస్సు, సూపర్ స్టార్ డమ్, నటన ఇంకా అద్భుతమైన ఏజెంట్ గా దీపికా పదుకొణె.. విలన్ గా జాన్ అబ్రహం బాగా అదరగొట్టేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దీన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులను ఆకర్షించేలా సినిమాలు చేయడంలో నిపుణులైన అతి కొద్దిమందిలో సిద్ధార్థ్ కూడా ఒకరు. అలాగే నా స్నేహితుడు అదిత్య చోప్రాకు కూడా అభినందనలు. మీరు ఆయన్ని ఎప్పుడూ చూసి ఉండరు. కాకపోతే మూవీ పట్ల అతడికి ఉన్న విజన్ అద్భుతం.ఇక కింగ్ ఖాన్ గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడికి వెళ్లిపోలేదు. బాక్సాఫీస్ ను రూల్ చేయడానికి సరైన సమయం కోసం ఇన్ని రోజులు వేచి చూశాడు. ఇప్పటిదాకా మీరు ఎన్నో విమర్శలు ఇంకా బహిష్కరణలు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ మీ దారిలో మీరు వచ్చినప్పుడు ఆ మార్గంలో ఎవరు నిలబడలేరు అనేది ముమ్మాటికీ నిజం.' అంటూ కరణ్ చెప్పుకొచ్చారు.ఇక కరణ్ ని నెటిజన్స్ ఏ విధంగా ట్రోల్ చేస్తారో తెలిసిందే. అతడి సినిమా వస్తుందంటే చాలు ఖచ్చితంగా ప్లాప్ చేస్తారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: