ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా కథతో సిద్ధంగా వున్న ఆ దర్శకుడు...!!

murali krishna
ఎన్టీఆర్ rrr లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించబోయే తాజా చిత్రం NTR30 ఈ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివ తో చేయబోతున్నాడని అందరికి తెలుసు.
ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్న కానీ ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ అస్సలు మొదలుపెట్టలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని చిత్ర యూనిట్ న్యూ ఇయర్ కానుకగా ఒక ఆప్డేట్ అయితే ఇచ్చింది. ఈ సినిమాని కూడా ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారని సమాచారం..
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా ఎవరు నటిస్తున్నారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. గతంలో ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్ గా బాలీవుడ్ అగ్ర హీరోలు నటిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అందులో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌కు విలన్‌గా కన్ఫర్మ్ అయ్యాడనే వార్త కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా హాలీవుడ్ నటుడు నటించబోతున్నారని సమాచారం.
RRR సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ అయితే వచ్చింది. rrr సినిమాలోని కొమరం భీమ్‌ పాత్రలోని ఎన్టీఆర్ నటనకు గాను హాలీవుడ్ నుంచి ఎన్నో ప్రసంసలు, అవార్డు లు వచ్చాయి. ఆయన ఆస్కార్ నామినేషన్ లో కూడా మొదటి స్థానంలో ఉన్నారంటూ హాలీవుడ్ మీడియా వారు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈరోజు ఆస్కార్ నామినేషన్ల తుది జాబితా విడుదల చేయనున్నారు. అందులో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
కొరటాలతో ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది.. ఆ క్యారెక్టర్ కు తగ్గ నటుడు కోసం కొరటాల సెర్చింగ్ ఇప్పటికే మొదలుపెట్టాడని సమాచారం. కొరటాల ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చేస్తున్న విధానం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉందని .. పైగా జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఎన్టీఆర్- కొరటాల కలయికలో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయినట్టు సమాచారం.. ఇక ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: