మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్...!!

murali krishna
అజిత్‌ హీరో గా నటించిన తుణివు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీ విడుదలై  టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను అయితే రాబడుతోంది.
దీంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక అజిత్‌ విషయం తెలిసిందే. నటించి పూర్తి చేశాను... అంతవరకే అన్నట్లు ఉంటుంది ఈయన ప్రవర్తన
ప్రస్తుతం ఈయన తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.. నయనతార భర్త విగ్నేష్‌ శివన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.. మైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారటా.. దీని గురించి చిత్త యూనిట్‌ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా కానీ ఇప్పటికే రకరకాల వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అజిత్‌ సరసన నటించే హీరోయిన్ల గురించి బాగా చర్చ జరుగుతోంది. ముందుగా నటి నయనతార నటిస్తున్నట్లు ప్రచారం  అయితే జరిగింది. ఆ తర్వాత త్రిష అంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తరువాత నటి ఐశ్వర్యరాయ్ మరియు సాయి పల్లవి పేర్లు వినిపించాయి.
తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చిందటా.తానే కీర్తి సురేశ్‌. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని అలాగే అందులో నటి ఐశ్వర్యరాయ్‌ ఒకరు కాగా ఇక రెండో హీరోయిన్‌గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే కీర్తి సురేష్‌ పంట పండినట్లే అవుతుంది.. ఇప్పటికే ఈమె నటుడు రజనీకాంత్, విజయ్ మరియు సూర్య, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించారు. అజిత్‌కు జంటగా నటించాలనే ఆసక్తిని ఇటీవల ఆమె ఒక భేటీలో కూడా వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామనిదన్‌ చిత్రం త్వరలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: