వాల్తేరు వీరయ్య: వామ్మో మరో అదిరిపోయే రికార్డు?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ తరువాత తీసిన సినిమా "వాల్తేరు వీరయ్య". యంగ్ డైరెక్టర్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మించారు. ఇక సినిమా వచ్చి పది రోజులైనా కూడా ఫ్యాన్స్ ఇంకా ‘వాల్తేరు వీరయ్య’ మత్తులోనే ఉన్నారు టాలీవుడ్‌ ప్రేక్షకులు. వింటేజ్‌ మెగాస్టార్‌ను చూసి మెగా అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికెల్లావయ్యా బాబీ అంటూ సినిమా దర్శకుడిపై ఒక రేంజిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య సినిమా మొదటి రోజు నుంచే కోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమా తొలి రోజే అనుకంటే రెండో రోజు కూడా భారీ కలెక్షన్‌లు రాబడుతూ అందరిని బాగా ఆశ్చర్యంలో పడేసింది. రీ ఎంట్రీ తర్వాత ఈ రేంజ్‌ కలెక్షన్‌లు అసలు ఏ సినిమా రాబట్టలేకపోయింది. ఇక చిరుకు మాస్ మహారాజా రవి తేజ తోడవడంతో నిర్మాతలపై కాసుల వర్షం కురుస్తుంది.


ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాలతకు 17 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా ఈ సినిమా తెచ్చిపెట్టే పనిలో ఉంది.ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. వాల్తేరు వీరయ్య సినిమా పదవ రోజు ఏకంగా రూ.6.6 కోట్లు కలెక్ట్‌ చేసి నాన్‌-రాజమౌళి రికార్డుని క్రియేట్‌ చేసింది. నిజానికి ఈ సినిమాకు మొదట డివైడ్‌ టాక్ వచ్చినా కానీ అసలు టాక్‌తో సంబంధలేకుండా కలెక్షన్‌ల వేట కొనసాగిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా పండింది. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా చిరుకు జోడీగా శృతిహాసన్‌ నటించింది. ఇక మాస్ మహారాజా రవితేజ పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా సగం సినిమాను తన భుజాలపై వేసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు.త్వరలో ఈ సినిమాని తమిళ్ లో కూడా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: