తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కు అన్ని కోట్ల దూరంలో ఉన్న "వారసుడు" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వారిసు అనే మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో శ్రీకాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన తమిళ భాషలో విడుదల చేశారు. ఆ తర్వాత జనవరి 14 వ తేదీన ఈ సినిమాను తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేశారు. మొదటి గా తమిళ్ లో విడుదల అయిన ఈ సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తెలుగు వర్షన్ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి  షోకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి టాక్ లభించింది. దానితో ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.98 కోట్ల షేర్ , 25.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై మొదటి నుండి తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా భారీ బిజినెస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఈ సినిమా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇంకో 1.02 కోట్ల షేర్ కలక్షన్ కనుక రాబట్టినట్లు అయితే ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: