సెకండ్ ఇన్నింగ్స్ ఆ హీరో కు అంతగా కలసి రాలేదా...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో ఎంతో మంది హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో అలరించేవారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరని చెప్పవచ్చు.

ఎన్నో చిత్రాలలో విలన్ గా ను సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించి ఆ తర్వాత హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను సైతం అందుకున్నారు. ఇక తన కెరియర్ లో ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆయన దగ్గరయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోగా ఫెయిల్యూర్ కావడంతో విలన్ గా పలు సినిమాలలో అయితే నటించారు.

కానీ విలన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన మరొక హీరో జగపతిబాబు మాత్రం విలన్ గా కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను  ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నారు.. గతంలో కంటే ప్రస్తుతం పలు అవకాశాలు ఇతర భాషలలో కూడా ఎక్కువగానే వస్తున్నాయటా జగపతిబాబుకు. అయితే జగపతి బాబును చూసి శ్రీకాంత్ కూడా సెకండ్ డేంగ్స్ విలన్ గా మారినప్పటికీ పెద్దగా సక్సెస్ అయితే కాలేకపోతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ వయసు 54 సంవత్సరాలు.. మొదట యుద్ధం శరణం అనే చిత్రంతో పూర్తిస్థాయిలో విలన్ అవతారం చూపించారు.

ఆ తర్వాత మలయాళం లో దివిలన్ అనే సినిమా కన్నడలో పలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా నటించారు.తెలుగులో మాత్రం అఖండ సినిమాలో విలన్ గా నటించి మెప్పిస్తారు అనుకుంటే ఈ చిత్రంలో శ్రీకాంత్ కంటే మరొక విలన్ కే క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఒక రకంగా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మాత్రమే సక్సెస్ అయ్యారని తెలుస్తుంది.. శ్రీకాంత్ మాత్రం విలన్ గా అయితే సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రస్తుత శ్రీకాంత చేతిలో హంట్ అనే సినిమా మాత్రమే మిగిలి ఉందని సమాచారం.. మరి ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతారమో ఇప్పుడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: