త్రిష ఆ వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోందా..?

Divya
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించి నూతన ఉత్సాహంతో వరుసగా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ముందు.. సినిమా తర్వాత అన్నట్లుగా ఈమె కెరియర్ సాగుతుందని చెప్పవచ్చు. నాలుగు పదుల వయసులో ఈ బ్యూటీకి మణిరత్నం రూపంలో అదృష్టం తలుపు తట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే రాంగీ చిత్రంలో తన యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసిన త్రిష ఇప్పుడు చతురంగవేట్టై -2 లో కూడా నటిస్తోంది.
ప్రస్తుతం రామ్ పార్టు - 1 , ది రోడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. మరోపక్క అజిత్ 62వ చిత్రంలో కూడా నటిస్తోంది.  ఇకపోతే ఇన్ని వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా వుండగా గతంలో నటుడు అజిత్ ఇంటి సమీపంలో రూ.5 కోట్లతో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసిన త్రిష ప్రస్తుతం అందులో నివసిస్తోందా? లేదా? తెలియదు కానీ ఇప్పుడు నటుడు విజయ్ ఇంటి సమీపంలో ఏకంగా రూ.35 కోట్ల ఖర్చుతో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు అవుతున్నాయి.  ముఖ్యంగా ఈ ఇంటిలోనే త్రిష ఇప్పుడు నివసించబోతున్నారు అనే వార్తలు కూడా వస్తూ ఉండడం గమనార్హం.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక వ్యాపారవేత్తతో త్రిష సహజీవనం చేస్తోంది అని అయితే ఈ విషయాన్ని ఆమె బయట పెట్టడం లేదు అనే వార్తలు ఇప్పుడు గుప్పు మంటున్నాయి. గత కొన్ని రోజులుగా నటి ఆ వ్యాపారవేత్తతో కలిసి జీవిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కానీ ఆ సంబంధం గురించి ఈమె  మాత్రం నోరు విప్పడం లేదు అంతేకాదు విజయ్ ఇంటి దగ్గర్లో ఆ వ్యాపారవేత్త ఉన్నాడు అని అందుకే ఆమె అక్కడ ఆ ఇంటిని కొనుగోలు చేసిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలకు చెక్ పడాలి అంటే నటి త్రిష స్పందించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: