బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య.. అక్కడ డిజాస్టర్ అయిందా?

praveen
2023 ఏడాది అటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు శుభారంభం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇక ఈ రెండు సినిమాలు కూడా ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం గమనార్హం. దీంతో ఏ సినిమా హిట్ అవుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఒకరోజు ముందు విడుదలైన వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా.. ఒక రోజు లేటు విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి డామినేషన్ చూపించింది అని చెప్పాలి.

 ఇక ఈ సినిమాలో చిరంజీవి మళ్ళీ పాత రోజులను గుర్తు చేశాడని తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడని సినీ అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఇక ప్రేక్షకులు చిరంజీవిని సినిమాల్లో ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఇక దర్శకుడు బాబి అలాగే చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పాలి. అయితే బ్లాక్ బస్టర్ సాధించిన వాల్తేరు వీరయ్య సినిమా ఒకచోట మాత్రం జీరో వసూళ్లతో డిజాస్టర్ గా నిలిచింది అన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 తెలుగుతో పాటే అటు హిందీలో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేశారు నిర్మాతలు. కాగా అక్కడ రవితేజ, చిరుకి కూడా డీసెంట్ మార్కెట్ ఉంది అని చెప్పాలి. దీంతో ఇక అక్కడ కూడా లాభాలు వస్తాయని ఆశించారు. కానీ హిందీలో రిలీజ్ అయ్యిందా లేదా అన్నది ఇప్పటికీ ప్రేక్షకుల్లో కన్ఫ్యూషన్ ఉంది. ఎందుకంటే ఒకవేళ రిలీజ్ అయితే అక్కడ వసూళ్లకు సంబంధించిన అప్డేట్స్ ఏవి అని సినీ ప్రేక్షకులు అడుగుతున్నారు. ఇక బాలీవుడ్ ట్రాకర్స్ సైతం ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. దీంతో ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా అటు బాలీవుడ్ లో మాత్రం డిజాస్టర్ అయిందని.. అందుకే ఎవరు ఈ సినిమా గురించి మాట్లాడటం లేదని ఒక టాక్ తెరమీదికి వచ్చి వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: