అడ్వాన్స్ తిరిగిచ్చేసిన ప్రభాస్.. ఇక ఆ సినిమా లేనట్లేనా?

praveen
బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో కేవలం టాలీవుడ్ దర్శకులు మాత్రమే కాదు బాలీవుడ్ దర్శకులు సైతం కథలు చేతిలో పట్టుకుని ఇక ప్రభాస్ అపాయింట్మెంట్ కోసం క్యూ కాడుతున్నారు అని చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ తమ కథను ఓకే చెబితే సినిమా తీయాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అని చెప్పాలి. ఇప్పటికే చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఇక అతను ఓకే చెప్పిన సినిమాలు.. ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సినిమాలను లెక్క పెట్టాలి అంటే చేతివేళ్లు కూడా సరిపోవేమో.

 అయితే ఇప్పటికే క్షణం కూడా తీరికలేనంత బిజీగా ఉండే విధంగా సినిమాలను ఓకే చేసిన ప్రభాస్ ఇంకా తన దగ్గరికి వచ్చిన కథలను వింటూనే ఉన్నాడు అని చెప్పాలి. దీంతో ఇలా కొత్త కథ ఏదైనా నచ్చింది అంటే చాలు వెంటనే ఓకే చెప్పేసి.. ఇక ఆ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లాంటివి చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇక ఇటీవల ఒక నిర్మాత తనకు ఇచ్చిన అడ్వాన్సును వెనక్కి ఇచ్చేశాడు ప్రభాస్ అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. బాహుబలి సినిమా సమయంలోనే డార్లింగ్ ప్రభాస్ కు నిర్మాత డిపివి దానయ్య పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారట.

 పెద్ద దర్శకుడుతో ఈ సినిమా ఉంటుందని అప్పట్లో టాక్ కూడా వినిపించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమా ఇంకా మొదలవలేదు. అయితే మారుతి సినిమా దానయ్య బ్యానర్ లోనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి మారుతి సినిమా వేరే బ్యానర్ లో పట్టాలెక్కింది. అయితే దానయ్యతో ప్రభాస్ సినిమా ఉంటుందా లేదా అన్న చర్చి మొదలైంది. కాగా ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం దానయ్య సినిమాను చేయలేని ప్రభాస్ తేల్చేశారట. రెమ్యూనరేషన్ కింద తీసుకుని అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: