అనుపమ పై కేసు పెడతానంటున్న ఆ నెటిజెన్..!!

murali krishna
కేరళ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.తన అందంతో, నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ..

తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.. తెలుగుతో పాటు తమిళ మరియు మలయాళ సినిమాలలో కూడా కూడా నటించింది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. నితిన్ నటించిన 'అఆ' సినిమాతో నాగవల్లి పాత్రలో కూడా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండడమే కాకుండా అల్లరి పిల్లగా కూడా  పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం ఏదో ఒక ఫోటోను అలాగే ఫన్నీ వీడియోలను కూడా బాగా షేర్ చేస్తుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా ఫన్నీ వీడియోలను ఆమె బాగా పోస్ట్ చేసుకుంటుంది. ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ కూడా ఆశ్చర్య పరుస్తుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది. వారు అడిగే ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానం ఇస్తుంది.చాలావరకు ఇన్స్టా రీల్స్ తో తెగ సందడి చేస్తుంది. అంతేకాకుండా తన సోదరుడితో ఆడుకుంటున్న వీడియోలను మరియు అల్లరి చేస్తున్న వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్ లు చేయడం చాలా తక్కువనే చెప్పవచ్చు.. నాచురల్ గానే కనిపిస్తూ అందర్నీ కూడా ఫిదా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక ఫోటో పోస్ట్ చేసుకుంది. ఇక అందులో తను చాలా న్యాచురల్ గా ఎంతో అందంగా కనిపించింది. తన చూపులతో అందర్నీ కూడా మరోసారి ఫిదా చేసింది. అయితే ఆ ఫోటోని చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొట్టగా ఓ నెటిజన్ ఓ కామెంట్ కూడా పెట్టారు. ఇంతకు అదేంటంటే..ఈమధ్య హాట్ ని స్టీల్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కేసు పెట్టాలి అంటూ అనుపమ అందాలను తట్టుకోలేక అలా కామెంట్ ను పెట్టారు.ప్రస్తుతం ఆ కామెంట్ చూసి కొందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇప్పటికే కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమాలతో మంచి సక్సెస్ అందుకోగా ప్రస్తుతం మరిన్ని సినిమాలలో బిజీగా ఉంది. ఇక ఆ మధ్య డీజే టిల్లు 2 లో చాలా అవకాశం వచ్చిందని కానీ ఈ బ్యూటీ రిజెక్ట్ చేసింది అని న్యూస్ కూడా వచ్చింది.
06:04 PM

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: