మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్న మంచు మనోజ్.. సీక్రెట్ రివీల్..!

Divya
మంచు ఫ్యామిలీలో ట్రోల్స్ కి గురి కాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మంచు మనోజ్ మాత్రమే ఎప్పుడు కూడా గొప్పలకి పోడు.. పైగా తనను తాను ఒక సెలబ్రిటీ లాగా చూసుకునే వ్యక్తి కూడా కాదు.. ఒక సామాన్య ప్రేక్షకుడిలాగే తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకునే మంచు మనోజ్ అంటే చాలామందికి విపరీతమైన అభిమానం. అయితే గత కొద్ది రోజులుగా ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు కానీ పెళ్లి విషయంలో ఎప్పటికప్పుడు వార్తల్లోకి రావడం గమనార్హం.. 2015 మే 20 న ప్రణతి రెడ్డి వివాహం చేసుకున్నాడు. కానీ వీరి కాపురం కొన్నాళ్లకే ముగిసిపోయింది అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.
ఈ విషయంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నాడు అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.. స్వయంగా మనోజ్ సోషల్ మీడియాలో పేర్కొంటూ మరో రెండు రోజుల్లో తన జీవితానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వార్తలు మీ అందరితో పంచుకుంటాను అంటూ తెలిపాడు అంతేకాదు దీనికి సంబంధించి బుధవారం ఒక ట్వీట్ కూడా చేశాడు మనోజ్. నాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వార్తను గత కొంత కాలంగా నాలోనే దాచుకున్నాను.  నా లైఫ్ లో మరో దశలోకి ఇప్పుడు అడుగుపెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది పూర్తి వివరాలను జనవరి 20వ తేదీన ప్రకటిస్తాడు అంటూ రాసుకున్నాడు.
దీంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా భూమా మౌనిక రెడ్డి తో తన పెళ్లి గురించి ఆయన ప్రకటించబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా భూమా మౌనిక రెడ్డితో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ వున్న ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు మౌనిక కోసం మనోజ్ తన కుటుంబ సభ్యులతో కూడా గొడవపడి బయటకు వచ్చేసాడు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  మరి మనోజ్ నిజంగానే తన పెళ్లి తేదీ ప్రకటించబోతున్నాడా అనేది ఇప్పుడు సందేహంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: