యూఎస్ఏ లో సరికొత్త రికార్డు సృష్టించిన బెదురులంక 2012..!

Divya
ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకున్న హీరో కార్తికేయ.. డీజే టిల్లు సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం బెదురులంక 2012. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న కలర్ ఫోటో నిర్మాతలలో ఒకరైన రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ త్రీ గా బెనర్జీ దీనిని నిర్మిస్తూ ఉండడం గమనాభం. అలాగే సి యువరాజు చిత్ర సమర్పకులు కాగా.. క్లాక్స్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత బెనర్జీ మాట్లాడుతూ..  ఎన్నో విషయాలను పంచుకున్నారు.. కామెడీ డ్రామాగా గోదావరి నేపథ్యంలో సాగే ఈ కథతో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాము.  మెలోడీ బ్రహ్మా మణిశర్మ 5 అద్భుతమైన పాటలను అందించారు.  స్వర్గీయ సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాయడం నిజంగా మా అదృష్టం. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేటర్ బిజినెస్ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. గతంలో కార్తికేయ చిత్రానికి ఎన్నడూ లేని విధంగా థియేటర్స్ రూ.80లక్షల ఆఫర్ వచ్చింది. ది విలేజ్ గ్రూపీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  సొంతం చేసుకుంది.  అలాగే  సినిమా మ్యూజిక్ రైట్స్ ను సోనీ మ్యూజిక్ సంస్థ సుమారుగా రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు అని బెనర్జీ తెలిపారు..
సినిమా కథ విషయానికి వస్తే .. వినోదం మానవ భావోద్వేగాలతో కూడిన కథతో స్ట్రాంగ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు.  సొసైటీకి నచ్చినట్లు బ్రతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బ్రతకడం రైటా ?అనేది ఈ విషయంలో చాలా స్పష్టంగా చూపించారు. సినిమా విడుదల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అంటూ స్పష్టం చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ ,ఆటో రాంప్రసాద్, రాజకుమార్ కసిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సురభి, సత్య, కిట్టయ్య ,దివ్య నార్ని, అనితనాత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: