రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా అన్ని థియేటర్లలో విడుదల అయిన వారసుడు మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా వారిసు అనే తమిళ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , తమన్ సంగీతం అందించాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ... విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది.

ఈ మూవీ కి తమిళ భాషలో పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ కి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మొదట తెలుగు లో కూడా వారసుడు పేరుతో జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించిం.ది కాకపోతే ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు భాషలో జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. అందులో భాగంగా ఈ మూవీ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి భారీ ఎత్తున థియేటర్ లను కేటాయించారు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్ లలో విడుదల అయిందో తెలుసుకుందాం.


ఈ సినిమా నైజాం ఏరియాలో 164 థియేటర్ లలో విడుదల కాగా ... సీడెడ్ లో 45 థియేటర్ లు ... ఆంధ్ర లో 175 థియేటర్ లలో విడుదల అయింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 385 థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: