ఇండియన్ 2 మూవీ షూటింగ్ పై నోరు విప్పని కాజల్.. ఏమైందంటే..?

Divya
చందమామ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై చందమామ సినిమాతో భారీ పాపులారిటీ తగ్గించుకుంది. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ అయిపోయిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత తన సినీ కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ప్రభాస్ ను మొదలుకొని రాంచరణ్ వరకు ప్రతి ఒక్కరితో కూడా కలసి నటించి తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు మరొకవైపు తండ్రి , కొడుకులతో కూడా జతకట్టిన ఈ ముద్దు గుమ్మ అప్పట్లోనే అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది.

ఇకపోతే గత రెండు సంవత్సరాల క్రితం తన చిన్ననాటి స్నేహితుడు ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్న గౌతం కిచ్లు ను వివాహం చేసుకుంది.  ఇటీవల ఒక కొడుకుకు కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. అయితే వివాహం జరిగి బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ లో చాలా మార్పులు వచ్చాయి. ఇక పూర్వ రూపాన్ని పొందడానికి ఈమె జిమ్ లో తెగ వర్కౌట్లు చేస్తూ తనని తాను మార్చుకునే ప్రయత్నం చేసింది.  అందులో భాగంగానే జిమ్ లో తాను కష్టపడుతున్న వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.  ఇకపోతే ఇటీవల ఈమె బిడ్డ పుట్టిన తర్వాత కమలహాసన్ , శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఇదిలా ఉండగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా లైవ్ లో ప్రశ్నోత్తరాల సెషన్ లో పాల్గొన్న కాజల్ .. ఇండియన్ టు షూటింగ్ గురించి సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది.  అయితే ఎందుకు అన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.  కానీ ప్రస్తుతం తను  ప్రారంభించిన బేబీ కేర్ ఉత్పత్తులను మాత్రం అక్కడ ప్రచారం చేసిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: