"వారసు" మూవీకి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ తాజాగా వారిసు అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ ఈ మూవీ లో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అలాగే ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషలలో ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే చివరి నిమిషంలో ఈ మూవీ యొక్క తమిళ్ వర్షన్ ను జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... తెలుగు వర్షన్ ను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క తమిళ్ వర్షన్ ను నిన్న అనగా జనవరి 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. మరి ఈ మూవీ తమిళ్ వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.


తమిళనాడు లో ఈ మూవీ కి 20.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  కర్ణాటక లో 5.62 కోట్లు ,  కేరళ లో 4.55 కోట్లు ,  రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.15 కోట్లు ,  ఓవర్సీస్ లో 14.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కి 23.60 కోట్ల షేర్ ,  46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: