వీరసింహారెడ్డి టాక్: అభిమానులకి ఫుల్ మీల్స్.. పూనకాలే?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ రోజు చాలా గ్రాండ్ గా విడుదలయిన సినిమా 'వీర సింహా రెడ్డి'. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఇందులో బాలయ్య రెండు పాత్రలు చేశాడు. బాలయ్య గురించి తెలిసిందేగా..ద్విపాత్రాభినయంలో  జీవించేశాడు. జయ సింహా రెడ్డిగా యంగ్ గా కనిపించడానికి కొంచెం ఇబ్బందిపడినా.. వీరసింహారెడ్డిగా మాత్రం వెండితెరపై వీరంగం ఆడేశాడు. ముఖ్యంగా వీరసింహారెడ్డిగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ ఇంకా డైలాగులు మాస్ ఆడియన్స్, బాలయ్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. అయితే యాక్షన్ సీక్వెన్స్ కాస్త అతి అయినప్పటికీ.. ఎమోషన్ తో బాగానే నెట్టుకొచ్చాడు బాలయ్య.ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కు తన టాలెంట్ ను పూర్తిస్థాయిలో ప్రదర్శించింది. తన భానుమతి క్యారెక్టర్ కు ఆమె ప్రాణప్రతిష్ట చేసింది.ఒక్క మాటలో చెప్పాలంటే అదరగొట్టేసింది.అలాగే మలయాళ నటి హనీ రోజ్.. ఫస్టాఫ్ లో నటనతో ఇంకా సెకండాఫ్ లో గ్లామర్ తో బాగానే అలరించింది.


ఇక కన్నడ నటుడు దునియా విజయ్ కూడా బాగా నటించాడు.శ్రుతిహాసన్ విషయానికి వస్తే.. అసలేం లేదు. కేవలం రెండు పాటలు, మూడు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఈ హాట్ బ్యూటీకి బాలయ్యతో కెమిస్ట్రీ పెద్దగా వర్కవుటవ్వలేదు.ఏదో పేరుకి హీరోయిన్ గా పెట్టారంతే..ఇక తమన్ విషయానికి వస్తే బాలయ్యకి భయపడో లేదో సినిమాకి న్యాయం చెయ్యాలానో కానీ BGM మాత్రం రొట్ట కొట్టుడు కొట్టకుండా అదరగొట్టేసాడు.ఒక విధంగా థమన్ ఈ సినిమాకి సెకండ్ హీరో ని చెప్పాలి. చాలా పేలవమైన సన్నివేశాలను కూడా తనదైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగానే ఎలివేట్ చేశాడు. ఇక యాక్షన్ సీన్స్ కి తమన్ నేపధ్య సంగీతం బాగా కొట్టడంతో థియేటర్లలో పూనకాలు మాములుగా వుండవు అభిమానులకి. అయితే పాటలు మరీ సూపర్ కాకున్నా కూడా పర్వాలేదు అనేలా ఉన్నాయి.మొత్తానికి పండగ టైంలో అభిమానులకి పండగ లాంటి సినిమా ఈ వీరసింహారెడ్డి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: