ఆ మూవీకి దళపతి విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ని ఈ రోజు తమిళ భాషలో విడుదల చేశారు. జనవరి 14వ  తేదీన ఈ సినిమాను తెలుగు భాషలో విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విడుదల అయిన ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ కి తమిళ భాషలో మంచి టాక్ రావడంతో తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ మూవీ తెలుగు సినీ ప్రేమికులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వారిసు మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... వారిసు మూవీ కోసం దళపతి విజయ్ ఏకంగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే భారతీయ సినీ చరిత్రలో ఈ నటుడు కూడా ఇంత పారితోషకం తీసుకోలేదు అని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: