"యూఎస్ఏ" లో ఆఫ్ మిలియన్ సాధించిన వీర సింహారెడ్డి..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఆఖరుగా అఖండ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయం అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే తాజాగా బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరో గా నటించాడు. శృతి హాసన్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా ... వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ని మైత్రి మూవీ బ్యానర్ వారు నిర్మించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. హాని రోజీ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 11 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు సంబంధించిన ప్రీ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఇప్పటికే మొదలు అయ్యి చాలా రోజులు అవుతుంది.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూఎస్ఏ ప్రీమియర్ షో లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ యూఎస్ఏ ప్రీమియర్ షో లకు సంబంధించి ఆఫ్ మిలియన్ ఫ్రీ సేల్స్ జరిగినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రేంజ్ లో ప్రీ సేల్స్ అంటే వీర సింహా రెడ్డి మూవీ పై యూఎస్ఏ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నట్లే అని తెలుస్తుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: