వాల్తేరు వీరయ్య వెనుక చిరంజీవి గతం !

Seetha Sailaja

‘వాల్తేర్ వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి కావడంతో ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న టాప్ హీరోల ఫంక్షన్స్ అన్నీ పూర్తి అయ్యాయి. ఇక ప్రేక్షకుడి తీర్పు మాత్రమే రావలసి ఉంది. చాల సంవత్సరాల క్రితం విశాఖపట్నం ను వాల్తేర్ గా పిలుస్తూ ఉండేవారు. ఈవిషయాలు ఈనాటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే చిరంజీవి లేటెస్ట్ మూవీకి ‘వాల్తేర్ వీరయ్య’ అన్న టైటిల్ ఫిక్స్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ అలనాటి వాల్తేర్ పేరు మళ్ళీ ప్రచారంలోకి వచ్చింది.
 
 
ఈమూవీకి దర్శకుడు బాబి ‘వాల్తేర్ వీరయ్య’ అన్న టైటిల్ ఫిక్స్ చేయడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి అని బాబి చెపుతున్నాడు. బాబి ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆసినిమాలో నటించిన నాజర్ బాబీకి ఒక పుస్తకం ఇచ్చాడట. ఆ పుస్తకంలో వీరయ్య అనే క్యారెక్టర్ ఉందట. దీనితో తాను చిరంజీవితో తీస్తున్న సినిమాలోని హీరో పాత్రకు వీరయ్య అన్న టైటిల్ పెట్టాను అని బాబి అంటున్నాడు.
 
 అయితే ఈ వీరయ్య ‘వాల్తేర్ వీరయ్య’ గా మారడం వెనుక మరొక కారణం ఉందట. చిరంజీవికి తొలి ఫొటో షూట్ నిర్వహించిన వ్యక్తి పేరు కానిస్టేబుల్ వీరయ్య అని మెగా స్తార్ బాబీకి చెప్పాడట. అతడు తీసిన ఫోటోలతో తాను అవకాశాలు వెతుక్కుంటూ చెన్నై వచ్చిన విషయాన్ని చిరంజీవి బాబికి చెపుతూ వీరయ్య టైటిల్ ను ‘వాల్తేర్ వీరయ్య’ గా చిరంజీవి సలహాతో తాను మూవీ టైటిల్ ను మార్చిన విషయాన్ని బాబి బయట పెట్టాడు.
 
 
కారణాలు ఎలాంటివి అయినా ఇప్పుడు ‘వాల్తేర్ వీరయ్య’ టైటిల్ తెలుగు రాష్ట్రాలలో అందరికీ కనెక్ట్ అయింది. ప్రస్తుతం చిరంజీవికి ఒక సాలిడ్ హిట్ కావాలి. అలాంటి హిట్ ను ఈమూవీ అందిస్తుంది అన్న నమ్మకంతో చిరంజీవి ఉన్నాడు. దీనికితోడు ఈమూవీలోకి పాటలు కూడ బాగా హిట్ కావడంతో ప్రస్తుతానికి సంక్రాంతి రేస్ లో వీరయ్య ఉందడుగులో ఉన్నాడు అంటూ సంకేతాలు వస్తున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: