పోసానికి ఆ పాత్ర ఎలా వచ్చిందో తెలుసా...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక సినిమా కథ పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా లో ఎంపిక చేసిన నటీనటులు అనుకోని కారణాలవల్ల తప్పుకోవడంతో ఆ సినిమాలో ఇతర ఆర్టిస్ట్ లకు అవకాశాలు రావడం సర్వ సాధారణం ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రేటీలు డిజాస్టర్ సినిమాల నుంచి బయటపడగా, బ్లాక్ బస్టర్ సినిమాల ను కూడా వదులుకొని కూడా వారు బాధపడ్డారు.అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా ప్రేక్షకుల కు ఎంతలా నచ్చేసిందో మన అందరికి తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన కు ప్రతి ప్రేక్షకుడు కూడా ఫిదా అయ్యారు.ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ పోసాని కృష్ణ మురళి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి పెద్ద హైలైట్ గా నిలిచాయి.. ఈ సినిమాలో పోసాని డైలాగ్స్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే ఈ సినిమా లో పూరి జగన్నాథ్ ముందుగా పోసాని పాత్రలో పోసానిని కాకుండా పీపుల్ స్టార్ అయినా నారాయణమూర్తిని అనుకొని ఈ పాత్ర రాసారట.అందుకే పోసాని పాత్ర కు కూడా మూర్తి అనే పేరు కూడా పెట్టారు. ఇక ఈ పాత్ర లో నటించడం కోసం పూరీ జగన్నాథ్ ఆర్ నారాయణ మూర్తిని ఎంత బ్రతిమలాడినా కానీ ఈ సినిమాలో నటించనని చెప్పారట.

ఇక ఈ పాత్ర లో నటించమని ఎన్టీఆర్ సైతం నారాయణమూర్తి అడిగినప్పటికీ ఆయన ఎంతో సున్నితంగా ఈ సినిమాని రిజెక్ట్ చేయడం తో నారాయణమూర్తి స్థానం లో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పోసాని కృష్ణమురళి నటించారని సమాచారం.ఒకవేళ పోసాని స్థానం లో నారాయణమూర్తి కనుక నటించి ఉంటే ఈ సినిమా మాత్రం మరో లెవల్ లో ఉండేదని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోసాని కూడా మూర్తి అనే పాత్రకు వందశాతం న్యాయం చేశారని మనం చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: