"వాల్తేరు వీరయ్య" హిందీ ట్రైలర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ లో హీరోగా నటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ నిర్మించగా ... అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ ఈ సినిమాలో చిరంజీవి సనసన హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ... బాబి సింహ ముఖ్య పాత్రలలో నటించగా ... మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు. చిరంజీవి ... రవితేజ చాలా సంవత్సరాల తర్వాత కలిసి నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ మూవీ ని ఈ సంవత్సరం జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య చిత్ర బృందం ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన హిందీ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ సినిమా హిందీ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిటీ ఈ మూవీ యొక్క హిందీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ హిందీ ట్రైలర్ కు కూడా ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ హిందీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే జనవరి 13 వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: