తలపతి విజయ్ ఆఖరి 5 సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ ను సంపాదించుకున్న విజయ్ ఇప్పటివరకు ఎన్నో తాను నటించిన మూవీలను తెలుగులో కూడా విడుదల చేసి మంచి విజయాలను తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందుకున్నాడు. దానితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విజయ్ కి మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతూ వస్తుంది. విజయ్ ఆఖరుగా నటించిన 5 సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.


విజయ్ తాజాగా వారసుడు అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
విజయ్ హీరోగా మాళవిక మోహన్ హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలు 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
విజయ్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన విజిల్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సర్కార్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: