పాత సినిమాల డిమాండ్ లో పవన్ కళ్యాణ్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరనీ భక్తులు మాత్రమే ఉంటారని దర్శకుడు హరీష్ శంకర్ అనేకసార్లు చెపుతూ ఉంటాడు. పవన్ సినిమాలు వేగంగా చేయలేకపోయినా అతడు పెద్ద డాన్సర్ కాకపోయినా చెప్పుకోతగ్గ అందగాడు కాకపోయినా అతడి సినిమాలు వరసగా ఫెయిల్ అయినా ఈవిషయాలు ఏవి పవన్ అభిమానులు పట్టించుకోరు. అతడు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు అనుకుంటారు.

ఈమధ్య కాలంలో టాప్ హీరోల ఒకనాటి బ్లాక్ బష్టర్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. మహేష్ జూనియర్ ప్రభాస్ బాలకృష్ణ ఇలా చాలామంది టాప్ హీరోల బ్లాక్ బష్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఒక ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ కు అనుగుణంగా గత డిసెంబర్ 31న పవన్ కళ్యాణ్ బ్లాక్ బష్టర్ మూవీ ‘ఖుషీ’ ని తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో రీ రిలీజ్ చేసారు.

ఈసినిమాను ఇప్పటికే కొన్ని వందల సార్లు ఛానల్స్ లో యూట్యూబ్ లో జనం చూసినప్పటికీ మళ్ళీ ధియేటర్లలో రీ రిలీజ్ అయిన ఈమూవీని చూడటానికి పవన్ అభిమానులు విపరీతంగా ఆశక్తి కనపరచడంతో ఈమూవీకి కేవలం మూడు రోజులలో 4కోట్లు నెట్ కలక్షన్స్ వచ్చాయి అన్నవార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో చాల చోట్ల పవన్ అభిమానులు డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి కొత్త సంవత్సరాన్ని ‘ఖుషీ’ సినిమా చూస్తూ స్వాగతించారు అంటే పవన్ మ్యానియా ఏరేంజ్ లో ఉందో ఎవరికైనా వెంటనే అర్థం అవుతుంది.

ఇప్పుడు ఈ ట్రెండ్ ను గ్రహించిన పవన్ పాత సినిమాల నిర్మాతలు అతడు నటించిన చాల సినిమాలను ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి ప్రయాతాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా ఈనెల జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ‘బద్రి’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈమూవీలో పవన్ ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్’ అంటూ ఆవేశంగా చెప్పే డైలాగ్ మళ్ళీ ధియేటర్లలో ప్రతిధ్వనించబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: