2022లో రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి పీపుల్స్ మీడియా సంస్థ ప్రస్తుతం వరస సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ ఎక్కువ శాతం విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ నిర్మాణ సంస్థ నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 మూవీ ని నిర్మించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ... పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా కార్తికేయ 2 మూవీ తో పోయిన సంవత్సరం అద్భుతమైన విజయం అందుకున్న ఈ నిర్మాణ సంస్థ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల అయిన ధమాకా మూవీ ని కూడా నిర్మించింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని తాజాగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా పీపుల్స్ మీడియా సంస్థ పోయిన సంవత్సరం నిర్మించిన కార్తికేయ 2 మరియు ధమాకా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: