వారిసు ట్రైలర్: విడుదలైన కొద్దిసేపట్లోనే సూపర్ రికార్డ్?

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారిసు. తెలుగులో ఈ మూవీని వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీలో కన్నాడా హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ రెండు పాటలు ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. పేరుకే తమిళ సినిమా అయినప్పటికీ మన దగ్గర కూడా భారీ అంచనాలే ఉన్నాయి.తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుంది. తాజాగా విడుదలైన మూవీ ట్రైలర్ బాగా వైరల్ అవుతూ సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. విడుదల అయిన కేవలం 20 నిమిషాల్లోనే ఏకంగా 2.2 మిలియన్ వ్యూస్ ను సాధించింది ఈ ట్రైలర్.


ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే విజయ్ గత సినిమా బీస్ట్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో విజయ్ ఓ పెద్ద మిలియనీర్ కుటుంబానికి చెందిన చిన్న కొడుకు గా చూపించారు. విజయ్ ఇంటికి దూరంగా తనకు నచ్చిన ప్రపంచంలో బ్రతుకుతుంటాడు.తన కుటుంబానికి బిజినెస్ లో శత్రువులు పెరిగారని తెలిసి విజయ్ వచ్చి ఆ సమస్యలని సాల్వ్ చేస్తాడు. ఇంకా అదే సమయంలో మనస్పర్థల కారణంగా విడిపోయిన తన కుటుంబాన్ని కూడా కలుపుతాడు. ఇదే పాయింట్ ఈ ట్రైలర్ లో చూపించారు. దాంతో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అన్నది క్లారిటీ వచ్చేసింది. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: