ప్రిన్స్ మూవీ నష్టాలను అలా భర్తీ చేసిన శివ కార్తికేయన్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ క్రేజీ హీరో ఇప్పటికే ఎన్నో తమిళ బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే డాక్టర్ ... డాన్ మూవీ లతో వరసగా రెండు 100 కోట్ల విజయాలను అందుకున్న ఈ హీరో తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి జాతి రత్నాలు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అనుదీప్ కే వీ దర్శకత్వం వహించాడు.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా కొంత కాలం క్రితమే తమిళ్ మరియు తెలుగు భాషలలో విడుదల అయింది. డాక్టర్ ... డాన్ మూవీ ల తర్వాత శివ కార్తికేయన్ ఈ మూవీ లో హీరో గా నటించడం ... అలాగే జాతి రత్నాలు మూవీ తర్వాత అనుదీప్ కేవి ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించ లేదు.

దానితో ఈ మూవీ కి నష్టాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ కి వచ్చిన నష్టాలను తీర్చేందుకు శివ కార్తికేయన్ తన రెమ్యూనరేషన్ లో నుంచి 6 కోట్లను డిస్ట్రిబ్యూటర్ లకు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా ప్రిన్స్ మూవీ నష్టాలను భర్తీ చేయడానికి శివ కార్తికేయన్ తన రెమ్యూనిరేషన్ నే వెనక్కు ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కార్తికయన్ "మావీరన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: