"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "హిట్ 2" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అడవి శేషు ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించు కున్నాడు.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో మేజర్ మరియు హిట్ ది సెకండ్ కేస్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి . ఇది ఇలా ఉంటే ఆఖరుగా అడవి శేషు హీరోగా తెరకెక్కిన హిట్ 2 మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ... నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని నిర్మించాడు. మీనాక్షి చౌదరి మూవీ లో హీరోయిన్ గా నటించింది .

మంచి అంచనాలు నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో అడవి శేషు మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకున్నాడు. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం రెంట్ బేస్ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ని ఎవరైనా ప్రస్తుతం చూడాలి అనుకుంటే 129 రూపాయలు చెల్లించినట్లు అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: