ఫిబ్రవరి 17వ తేదీన ఎన్ని మూవీలు విడుదల కాబోతున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
ఒకే తేదీన చాలా సినిమాలు విడుదల అవుతూ ఉండడం మనం సినిమా ఇండస్ట్రీలో అనేక సందర్భాలలో చూస్తూ ఉంటాం. అలాంటి వాతావరణం వచ్చే నెల 17 వ తేదీన కూడా కనిపించబోతోంది. ఫిబ్రవరి 17 వ తేదీన కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
శాకుంతలం : అందాల ముద్దుగుమ్మ సమంత ప్రధాన పాత్రలో తేరకేక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో దేవ్ మోహన్ ,  మోహన్ బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దమ్కి : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.
వినరో భాగ్యము విష్ణు కథ : కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మురళీ కిషోర్ అబ్బోరు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
సార్ : వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ధనుష్ హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: