"ఖుషి" రీ రిలీజ్ లో భాగంగా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను ... ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ లలో ఖుషి మూవీ ఒకటి అనే విషయం కూడా మనకు తెలిసిందే.

ఖుషి మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన  క్రేజ్ లభించింది. భూమిక చావ్లా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మెలోడీ బ్రహ్మ ఈ మణిశర్మ ఈ మూవీ కి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అప్పట్లో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పోయిన సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీన 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ 4 కే వర్షన్ రీ రిలీజ్  కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. అలా ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న ఈ మూవీ తాజాగా 4 కే వర్షన్ తో రీ రిలీజ్ కాగా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమ ప్రపంచవ్యాప్తంగా 5.91 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: