ఇండియాలో చరిత్ర సృష్టించిన అవతార్ 2?

Purushottham Vinay
పాన్ వరల్డ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ 2 సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అవతార్ మొదటి పార్ట్ విడుదలైన 13 ఏళ్లకు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి భారీ ఓపినింగ్స్ తో అదరగొట్టిన అవతార్2 సినిమా ఇప్పటికీ అదే దూకుడుతో చాలా వేగంగా దూసుకుపోతోంది. గతంలో వచ్చిన అవతార్ పార్ట్ 1 కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఎప్పటినుంచో ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన ఈ మూవీ డిసెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సుమారు 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ ను ఎంతగానో ఫిదా చేస్తుంది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 160 భాషలలో విడుదలై అన్ని చోట్లా కూడా సంచలనం సృష్టించింది.


ఇక ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా చాలా విపరీతంగా ఆకట్టుకుంది.. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి పదిహేను రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి అదే రేంజ్ లో అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమా ఇండియాలో రూ.300.90 కోట్ల నెట్ కలెక్షన్లను ఇంకా రూ.347.88 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే..నైజాం 26.84 కోట్లు, సీడెడ్ 5.88 కోట్లు ఇంకా ఉత్తరాంధ్ర 6.66 కోట్లు, ఈస్ట్, వెస్ట్ కలిపి 2.91 కోట్లు, కృష్ణా  ఇంకా అలాగే గుంటూరు ఏరియా మొత్తం కలిపి 5.46 కోట్లు, నెల్లూరు 2.51 కోట్లు, మొత్తంగా ఏపీ ఇంకా తెలంగాణ మొత్తం కలిపి ఏకంగా 50.26 కోట్లు వసూల్ చేసింది అవతార్ 2 .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: