"పూనకాలు లోడింగ్" సాంగ్ కు 24 గంటల్లో ఇదే రెస్పాన్స్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మైత్రి మూవీ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ క్రేజీ మూవీకి సంగీతం అందించగా ... అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీన భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా ఫుల్ జోష్ లో మొదలుపెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ భారీ ఎత్తున ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఆ ప్రెస్ మీట్ లో భాగంగా సినిమాకు సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి పూనకాలు లోడింగ్ అనే అద్భుతమైన మాస్ సాంగ్ ను ఈ సినిమా బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సాంగ్ లో చిరంజీవి మరియు రవితేజ నటించారు. వీరిద్దరూ ఈ సాంగ్ లో వేసిన స్టెప్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా ... ఈ సాంగ్ లో కొన్ని పదాలను చిరంజీవి మరియు రవితేజ కూడా పాడడం విశేషం. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 7.64 మిలియన్ వ్యూస్ ను ... 221.3 కె లైక్ లను సాధించి ఓవరాల్ గా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం కూడా ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: