స్పీడ్ పెంచేసిన కళ్యాణ్ రామ్.. డెవిల్ నుంచీ అప్డేట్..!

Divya
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం జోరు మీదున్నాడు. గత కొన్ని రోజుల వరకు ఈయన తెరకెక్కించిన సినిమాలు వరుసగా డిజాస్టర్ అవ్వగా.. పూర్తిస్థాయిలో నష్టపోయారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది పడ్డ కళ్యాణ్ రామ్ కి తమ్ముడు ఎన్టీఆర్ అండగా నిలిచి తను తెరకెక్కించే సినిమాలలో.. నిర్మాణంలో భాగం ఇస్తూ ఆయనను ఆర్థికంగా మళ్లీ ఉన్నత స్థానానికి తీసుకొచ్చారు. అలా అప్పుల్లో కూరుకుపోయిన కళ్యాణ్ రామ్ కి జై లవకుశ సినిమా నిర్మాణంలో భాగం కల్పించి అప్పులను పూడ్చుకునే విధంగా సహాయపడ్డాడు ఎన్టీఆర్.

ఈ క్రమంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బింబిసారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ సినిమా లాంగ్ గ్యాప్ తర్వాత బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందించింది. ఈ సినిమా 2022లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలవడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ అందించిన జోషులో తన తదుపరి సినిమాను చక చక పూర్తి చేస్తున్నాడు కళ్యాణ్ రామ్ . ప్రస్తుతం డెవిల్ పేరుతో ఒక పీరియాడికల్ యాక్షన్ ఫిలిం చేస్తున్నాడు. 1945 మద్రాస్ ప్రెసిడెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు ఈ సినిమా మూడవ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శనివారం చిత్ర బృందం ప్రకటించింది. మూడో షెడ్యూల్లో బ్రిటిష్ కాలాన్ని తలపించేలా హైదరాబాద్లో వేసిన భారీ సెట్ లో  కల్యాణ్ రామ్ తో పాటు ప్రధాన తారాగణం పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళ్, హిందీ అలాగే మిగిలిన భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ నామ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 10వ తేదీన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: