2022 పూజా హెగ్డే కు బ్లాక్ ఇయర్ గా మిగిలనుందా..?

Divya

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.  అందంతో పాటు మంచి అభినయం, నటన, ప్రతిభ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఒక లైలా కోసం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పూజా హెగ్డే ఆ తర్వాత వరుస సినిమాలు చేసి ఒకరకంగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం, అలా వైకుంటపురంలో వంటి సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న పూజా హెగ్డే వెనుతిరిగి చూడలేదు.  కానీ ఈ ఏడాది మాత్రం ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి జంటగా నటించిన ఆచార్య సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది.  అయితే ఈ సినిమా ఊహించని స్థాయిలో బెడిసి కొట్టింది . ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు . ఆ తర్వాత ప్రభాస్ సరసన రాధే శ్యామ్ పాల్ ఇండియా మూవీలో కూడా నటించినా ఈ సినిమాతో కూడా కలిసి రాలేదు. మొత్తానికైతే వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యేసరికి ఈమెను ఐరన్ లెగ్ అంటూ అందరూ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె చేతిలో మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న #SSMB 28 చిత్రం మాత్రమే ఉంది.  ఈ సినిమా తర్వాత ఆమె మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.. అయితే దీనికి కారణం ఈ సంవత్సరం ఈమెకు పెద్దగా కలిసి రాలేదు అని.. అందుకే ఈ ఇయర్లో సైన్ చేసే ప్రాజెక్టులన్ని కూడా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉందని గట్టిగా నమ్ముతోంది. అందుకే మహేష్ బాబు సినిమా తర్వాత ఆమె మరొక సినిమా ప్రకటించలేదు.  వచ్చే యేడాదైనా కొత్త సినిమా ప్రాజెక్టుల అనౌన్స్మెంట్ ఇస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: