ఇంస్టాగ్రామ్ లో 16 మందిని ఫాలో అవుతున్న ప్రభాస్.. వాళ్ళు ఎవరో తెలుసా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ హీరో ప్రభాస్ కి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో అందరి హీరోల్లాగాన్నే ప్రస్థానం మొదలుపెట్టిన ప్రభాస్ ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అప్పటి నుంచి ప్రభాస్ చేసే సినిమాల రేంజ్ కూడా అదే రీతిలో పెరిగింది అని చెప్పాలి. అయితే ప్రభాస్ కి ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హీరోగా మాత్రమే కాదు ఇక అతని మంచి వ్యక్తిత్వాన్ని చూసి కూడా అతన్ని అభిమానిస్తున్న వారు చాలామంది ఉన్నారు.

 సినిమాల్లో ఆరడుగుల అందగాడిగా ఎంతో స్టైలిష్ లోకి కనిపించే ప్రభాస్.. నిజ జీవితంలో సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. అందరిలాగా గొప్పలకు పోడు.. వివాదాల్లో తల దూర్చాడు. అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడు. ఎంతో సాదాసీదా మనిషిలా కనిపిస్తూ అభిమానుల మనసుకు దగ్గరవుతూ ఉంటాడు. అందుకే ఫాన్స్ అతనిపై చూపించే ప్రేమ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరో అన్నట్లుగానే సింప్లిసిటీతో ఉంటాడు. ఇటీవలే బాలయ్య వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వచ్చి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు ప్రభాస్.
 సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు అన్న విషయం తెలిసిందే. కానీ ప్రభాస్ కి ఇన్స్టాగ్రామ్ లో తొమ్మిది మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ప్రభాస్ మాత్రం కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతూ ఉండడం గమనార్హం. దీంతో  డార్లింగ్ ప్రభాస్ ఫాలో అవుతున్న ఆ 16 మంది స్పెషల్ సెలబ్రిటీలు ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఆ వివరాలు చూసుకుంటే..
1.దివంగత కృష్ణం రాజు గారు
2.సందీప్ రెడ్డి వంగ
3.బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్
4.హీరోయిన్ క్రితీ సనన్
5.ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్
6.డైరెక్టర్ నాగ్ అశ్విన్
7.డైరెక్టర్ రాధాకృష్ణ
8.హీరోయిన్ శృతిహాసన్
9.ప్రశాంత్ నీల్
10.బాలీవుడ్ లెజెండ్ అమితాబ్
11.డైరెక్టర్ ఓం రౌత్
12.హీరోయిన్ దీపికా పదుకొనే
13.నటి భాగ్య శ్రీ
14.హీరోయిన్ పూజా హెగ్డే
15.హీరోయిన్ శ్రద్ధా కపూర్
16. డైరెక్టర్ సుజీత్ లను మాత్రమే ప్రభాస్ ఫాలో అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: