యాంకర్ రష్మీని.. పోర్న్ స్టార్ తో పోల్చిన రాంప్రసాద్.. అందరూ షాక్?
కొన్ని కొన్ని సార్లు శ్రీదేవి డ్రామా కంపెనీలో కమెడియన్స్ వేసే పంచులు ఇక సెలబ్రిటీల అభిమానులను సైతం షాక్ కి గురయ్యేలా చేస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఏకంగా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా కూడా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇటీవలే విడుదలైన లేటెస్ట్ ప్రోమో లో కూడా ఇలాంటి ఒక చెత్త పంచ్ కాస్త అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఏకంగా యాంకర్ రష్మీ ని రాంప్రసాద్ పోర్న్ స్టార్ తో పోల్చడంతో అందరూ షాక్ అయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీద ఆటో రాంప్రసాద్ రష్మీ ఇంద్రజ నరేష్ అందరూ కూడా కలిసి దేవుడిని ప్రార్థించి బాల్యంలోకి వెళ్లే వారని కోరుకుంటారు.
ఇక ఆ తర్వాత అందరూ కూడా స్కూల్ డ్రెస్సులు వేసుకొని బాల్యంలోకి వెళ్లినట్లుగా నటిస్తారు. ఈ క్రమంలోనే రశ్మిని ఆ డ్రెస్ లో చూసిన ఇమాన్యుయల్ ఎక్కడో చూసినట్టు ఉంది అని డైలాగ్ వేశాడు. అదేంటి ఎప్పుడూ చూడలేదా మియా కలీఫా అనేసరికి స్టేజి మీద ఉన్న వారందరూ షాక్ అయ్యారు. కానీ రష్మీ మాత్రం కళ్ళజోడు పెట్టుకుని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది అని చెప్పాలి. అయితే ఈ డైలాగ్స్ అక్కడ వినే వారికి బాగున్నాయేమో కానీ ఇక ఆడియన్స్ కి మాత్రం అస్సలు నచ్చలేదు అని చెప్పాలి. మంచి పంచులు వేసి నవ్వించడం మానేసి ఇలాంటి చెత్త పంచులతో చిరాకు తెప్పించడం ఏంటి అని కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.