ప్రభాస్ గురించి మరో నిజం..ఇక జన్మలో పెళ్లి..

Satvika
ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రభాస్ పెళ్లి వార్త చక్కర్లు కొడుతోంది.. బాహుబలి తర్వాత అందరి ఆలోచన డార్లింగ్ వెళ్ళేప్పుడని..ఈ విషయం పై చాలా సందర్భాల్లో రుమెర్స్ కూడా ఎదుర్కొన్నారు.. కానీ సరైన సమాధాన మాత్రం చెప్పలేదు అందుకే ఇప్పుడు అతని మనసులో మాట బయట పెట్టాడు..పెళ్ళి వద్దని చెప్పకనె చెప్పాడు. తాజాగా ఆయన బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా బాగా ఫెమస్ అయ్యాడు.. మొదటి షో సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. దాంతో ఇప్పుడు రెండో సీజన్ ను చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. చాలామంది ఇండస్ట్రీ జనాలు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ షో కి వచ్చారు..

ఈయన తో పాటు హీరో గోపిచంద్ కూడా వచ్చారు. ఎవరికీ తెలియని కొన్ని నిజాలను బయట పెట్టారు.. అందుకు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్లో చక్కర్లు కొడుతోంది.. టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ గోపీచంద్ లు వచ్చిన ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా టీమ్.. మొదటి షోను డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేస్తే రెండో భాగం జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ షో కి సంబంధించిన మరొక ప్రోమోని రిలీజ్ చేశారు ఆహా యూనిట్. డార్లింగ్ పదం గురించి కూడా వివరంగా చెప్పారు..

ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని బాలకృష్ణ అడగడంతో రాసిపెట్టి లేదు సార్ అని ఆన్సర్ ఇచ్చారు. దీనికి బాలకృష్ణ మాట్లాడుతూ మీ అమ్మకు చెప్పిన విషయం నాకు చెప్పకయ్యా అసలు విషయం చెప్పు అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా నీ గర్ల్ ఫ్రెండ్స్ నిన్ను ముద్దుగా ఏమని పిలుస్తారు అని బాలకృష్ణ అడిగితే..ఏమో సార్ నాకు గుర్తులేదు అసలు నేను వేసుకోవాల్సిన టాబ్లెట్ మర్చిపోయాను. తెలివిగా తప్పించుకున్నాడు.. మొత్తానికి ఆ షో మొత్తం నవ్వులను పూయించింది..ఆ ఎపిసోడ్ ఎప్పుడూ ప్రసారం అవుతుందో అని ఇప్పటి నుంచే ఫ్యాన్స్ వెయిటింగ్..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: