పుష్ప2 లో ఐటమ్ సాంగ్ లో అనసూయ..సుక్కు లెక్క తప్పడా..

Satvika
పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష న్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి ప్రభంజనాన్ని సృష్టించింది. ఒక్క సినిమా తో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోయిన్ సమంత ఆ సాంగ్ ను చేసింది.. సినిమా వచ్చి ఏడాది దాటినా కూడా ఆ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది..' ఊ అంటావా మావా..' స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే సినిమాల్లో.. అందునా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కి వుండే స్పెషల్ క్రేజ్ అంతా ఇంతా కాదు... మ్యుజిక్ వల్లే సినిమా హిట్ అయ్యిందని చెప్పాలి.. అందుకే పుష్ప 2 కూడా మ్యూజిక్ దేవిశ్రీప్రసాద్ నే అందిస్తున్నారు.. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైంది...

మొదటి సినిమా లో అనసూయ పాత్ర తన భర్త మంగళం శ్రీనుని చివర్లో కత్తితో పొడిచేస్తుంది. అయితే, మంగళం శ్రీను చనిపోడు. పుష్ప తనకు కలిగించిన నష్టం నేపథ్యంలో, అతని మీద మంగళం శ్రీను మీద తిరగబడతాడట. అతని భార్యగా భార్యగా అనసూయ, పుష్ప మీద తీర్చుకునే ప్రతీకారం.. ఈ క్రమంలో నే ఓ హాట్ అండ్ వైల్డ్ ఐటమ్ సాంగ్ వుంటుందని అంటున్నారు. అనసూయ ఇప్పటిదాకా ఎప్పుడూ చేయంత హాట్ షో ఈ ఐటమ్ సాంగ్‌లో చేయబోతోందని తెలుస్తుంది.. ఈ సినిమా లో కూడా హీరోయిన్గా రష్మిక మందన్న  నటిస్తుంది.. అంతకు మించిన సీన్లను ఈ సినిమాలో సుక్కు చూపించనున్నాడు.. ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: