న్యూ ఇయర్ వేడుకలకు భారీ ప్లాన్ చేస్తున్న మహేష్ బాబు..!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన క్రేజ్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలో నటించకపోయినా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లాంటి ఇంటర్నేషనల్ స్టార్ హీరోయిన్లు కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని తెగ ఆరాటపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారో అర్థం చేసుకోవచ్చు . ఇకపోతే ఈ ఏడాది ఆయనకు పూర్తిస్థాయిలో విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఈ ఏడాది జనవరిలో తన అన్నయ్య రమేష్ బాబు స్వర్గస్తులవగా.. తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28వ తేదీన అనారోగ్య సమస్యలతో కన్నుమూసింది.
అయితే ఈ రెండు బాధలను ఇంకా మరువక ముందే నవంబర్ 15వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ అవయవాలు పనిచేయకపోవడంతో మరణించడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు.  ఇలా ఒకే కుటుంబంలో మూడు మరణాలు వరుసగా చోటు చేసుకోవడంతో మహేష్ బాబు పూర్తిస్థాయిలో కృంగిపోయారు.  కానీ తనను తాను మరింత పదిలం చేసుకుంటూ మళ్లీ సినిమా రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా.. ఆ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తన కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించే పనిలో ఉన్న మహేష్ బాబు సినిమా షూటింగ్ వైపు వెళ్లలేదు.
ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు భారీ ప్లాన్ చేశాడు.  స్విజర్లాండ్ లోని లూసర్న్ లో 2023 న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోబోతున్నట్లు సమాచారం.  జనవరి మొదటి వారంలో మహేష్ బాబు హైదరాబాదుకు తిరిగి రానున్నారు. వెంటనే #SSMB28 చిత్రం రెగ్యులర్  షూటింగ్ ప్రారంభం కానుంది. త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పూర్తవగానే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: