'వాల్తేరు వీరయ్య ' టైటిల్ సాంగ్‌ రిలీజ్..మెగా ఫ్యాన్స్ కు జాతరే..

Satvika
గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'వాల్తేరు వీరయ్య ' ఈ సినిమాను బాబీ దర్శకత్వం రూపొందించిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదల కాగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి..ఆ పాటలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి... విడుదల అయిన కొద్ది రోజులకే యూట్యూబ్ తో మాంచి వ్యుస్ తో దూసుకు పోతున్నాయి..

ఈ మూడవ పాట కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా అది రెండు పాటల కు మించి ఉండడం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి నిదర్శనం గా మారుతుంది.. మరి సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మెగాస్టార్ చిరంజీవి నటించిన గత రెండు మూడు సినిమాలు ప్రేక్షకు లను ఏమాత్రం అలరించక పోవడం తో ఈ సినిమా పట్ల అందరూ, మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..


మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ఈ చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి చిత్రం కూడా విడుదల కాబోతూ ఉండడం విశేషం. ఈ రెండు సినిమాలను కూడా ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మరింత విశేషం. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు ఆ నిర్మాణ సంస్థకు ఎలాంటి కలెక్షన్ ను తెచ్చిపెడతాయో చూడాలి.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల జనాల్లొ అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. ఆ అంచనాల కు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ లో ఉండడం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.. ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ను అందుకున్న సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: